‘లూసిఫర్’లో సీనియర్ హీరోయిన్ ?

‘లూసిఫర్’లో సీనియర్ హీరోయిన్ ?

Published on Feb 22, 2021 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారట. కాగా హీరోయిన్ గా నయనతారను తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చినా.. తాజాగా ఈ పాత్రలో మరో సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోందని రూమర్ మొదలైంది.

మరి ఈ రూమర్ లో ఎంత నిజం ఉందో చూడాలి. కాకపోతే హీరోయిన్ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు. హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్ లో కూడా ఇన్ వాల్వ్ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు