తన పై వస్తోన్న రూమర్స్ కి త్రిష స్పందన ఇదే !

తన పై వస్తోన్న రూమర్స్ కి త్రిష స్పందన ఇదే !

Published on Jun 2, 2026 3:25 PM IST

Trisha

తమిళనాడు సీఎం, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ.. వారి మధ్య ఇప్పుడు ఏం జరుగుతోంది ?, నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉందా ?, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?, ఇలా తమిళ సినీ వార్తల్లో ఈ వార్తనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాగూ, విజయ్ భార్య సంగీత కూడా విడాకులకు అప్లయ్ చేశారు. కాబట్టి, విజయ్ – త్రిష మధ్య ఏదో నడుస్తోంది అని అందరూ భావిస్తున్నారు. కాగా ఇలాంటి వార్తలపై స్పందించని త్రిష తాజాగా పరోక్షంగా స్పందించారు.

త్రిష తన పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేస్తూ.. దానికి క్యాప్షన్‌ పెడుతూ.. ‘నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’ అంటూ త్రిష రాసుకొచ్చారు. నిజానికి త్రిష నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. తనపై రూమర్స్‌ క్రియేట్‌ చేస్తోన్న వారిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి త్రిష తన పై వస్తున్న రూమర్స్ విషయంలో కఠినంగానే ఉంది.

తాజా వార్తలు