స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని చేయబోతున్నారని, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్రివిక్రమ్ బన్నీ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ తో బన్ని తన తరువాత సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందట.
