త్రివిక్రమ్, పవన్ రుణం తీర్చుకుంటాడట..!

Published on May 21, 2020 10:10 pm IST

టాలీవుడ్ లో పవన్ మరియు త్రివిక్రమ్ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జల్సా సినిమా కోసం మొదటిసారి కలిసిన వీరి అనుబంధం, అత్తారింటికి దారేది చిత్రంతో మరింత దృఢంగా మారింది. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐతే పవన్ 25వ చిత్రంగా భారీ అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ గా నిలిచి అటు ఫాన్స్ కి మరియు పవన్ కి షాక్ ఇచ్చింది. 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.

త్రివిక్రమ్, పవన్ ల్యాండ్ మార్క్ మూవీని సరిగా తీయలేకపోయానని చాలా బాధపడ్డారు. ఐతే ఆయనకు ఓ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ ఋణం తీర్చుకుంటానని త్రివిక్రమ్ చెప్పడం జరిగింది. అలాగే పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచారట. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ మూవీ తరువాత త్రివిక్రమ్ పవన్ తోనే మూవీ చేయొచ్చన్నది సమాచారం. ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ సెట్ అయితే వెండి తెరపై మెరుపులే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

X
More