మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో ‘అ..ఆ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంచితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్నిచేయడానికి ఫిక్స్ అయ్యాడు. సూర్య కూడా త్రివిక్రమ్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ సూర్య సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసాడు. సూర్య సినిమాని మార్చిలో అధికారికంగా లాంచ్ చేసి, ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి అన్నీ సెట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే సూర్య, త్రివిక్రమ్ లు తమ కాల్షీట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈలోగా సూర్య తను త్వరలో మొదలు పెట్టనున్న ‘సింగం 3’ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. స్టూడియో గ్రీన్ వారి సమర్పణలో జులాయి ఫేం రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు.


