వచ్చే ఏడాది జూన్ లో.. ‘అయినను పోయి రావలె హస్తినకు’ ?

Published on Apr 6, 2020 12:01 am IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ఎందుకంటే ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే.

కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఏప్రిల్ అండ్ మే నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More