సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. చాలా రోజుల నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే జరిగిన మేము సైతం ఈవెంట్ లో త్రివిక్రమ్ – సమంత – మహేష్ బాబుల మధ్య జరిగిన ఇంటర్వ్యూలో 2015లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మహేష్ బాబు తెలిపాడు.
తాజా సమాచారం ప్రకారం 2015 సెకండాఫ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. ప్రసతుతం త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణనే మహేష్ – త్రివిక్రమ్ సినిమాని కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా మే లో సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ ఫిల్మ్ మొదలయ్యే అవకాశం ఉంది.


