వీరమల్లు సెట్స్‌లో మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ టెన్షన్!

వీరమల్లు సెట్స్‌లో మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ టెన్షన్!

Published on May 6, 2025 5:00 PM IST

Trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హిస్టారికల్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ తన పాత్రతో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఇటీవల జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమా సెట్స్‌లో పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా కనిపించాడట. దీంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

గతంలో కూడా త్రివిక్రమ్ పవన్ నటించిన బ్రో, భీమ్లా నాయక్ చిత్రాల సెట్స్‌లో కనిపించాడు. ఆ సినిమాలు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు వీరమల్లు సెట్స్‌లో త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

తాజా వార్తలు