బాలుగారి గురించి చెప్తూ ఎమోషనలైన త్రివిక్రమ్ !

Published on Jun 5, 2021 2:02 am IST

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పదాలకు మధురమైన గీతాలకు ప్రాణం పోశారు. తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వడు, మహా గాయకుడు బాలుగారు. అయితే, ఎస్పీ బాలు 75వ జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘బాలుగారి గురించి మాట్లాడడానికి నా అనుభవం సరిపోదు. ఆయనతో అనుబంధంతో మెలిగే అవకాశం నాకు ఎక్కువ దొరకలేదు. ఆయనను ఎక్కువ కలవలేకపోయాను. ఈ విషయంలో నేను రిగ్రెట్‌ గా ఫీలవుతున్నాను అని ఎమోషనల్ అవుతూ.. ‘అతడు’ సినిమాకు నాజర్ క్యారెక్టర్‌ కు బాలుగారితోనే డబ్బింగ్ చెప్పించాను. నా కోసమే ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పారు.

సంబంధిత సమాచారం :