
తన మాటల మ్యాజిక్‌తో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన S/O సత్యమూర్తి విడుదలైన తర్వాత ఆయన తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలేవీ తెలియజేయలేదు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే వారిద్దరూ ప్రస్తుతానికి ఇప్పటికే కమిటైన సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నారన్న వార్త వచ్చినా.. ఎన్టీఆర్, సుకుమార్ సినిమాకు కమిటై ఉన్నారు. ఇక ఈ గ్యాప్‌లో వేరే ఏదైనా చిన్న సినిమా చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటడ్ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఈ లేడీ ఓరియంటడ్ సినిమాల హవా కొనసాగుతుండడంతో ఈ ఆలోచన చేశారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనేదీ ఇంకా రాలేదు. అప్పటివరకూ దీన్ని ప్రచారంగానే చూడాల్సి వస్తుంది.

