ప్రభాస్.. ఇప్పుడు ఇండియాలో ప్రతి దర్శకుడు, నిర్మాత, నటీ నటులు కలిసి పనిచేయాలనుకునే ఏకైక స్టార్. ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వస్తే భారీ సినిమాలో భాగం అయినట్టేనని అందరికీ ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఆయన సినిమాలో నటించడమే ఒక గౌరవం అన్నట్టు భావిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్‌తో నోట మాట రాలేదట వర్కుచేసిన ప్రతి ఒక్కరూ ఆయన స్వభావాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. అదరూ చెప్పే కామన్ పాయింట్ ఒక్కటే.. అదే ప్రభాస్ డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని. తాజాగా ఇంకొక హీరోయిన్ కూడ ఇదే మాట అంటోంది.
ప్రజెంట్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. టీసిరీస్, రెట్రోఫైల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో కృతి సనన్ సీత పాత్ర చేస్తుండగా తృప్తి తోరడమాల్ ఒక కీలక పాత్ర చేస్తోంది. ఆమె షూటింగ్లో జాయిన్ అయిన రోజునే మొదటి షాట్ ప్రభాస్‌తో చేయాల్సి వచ్చిందట. ఇంకేముంది ఆమెకు కంగారు మొదలైందట. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ముందు నిలబడి డైలాగ్ చెప్పడమంటే ఎక్కడా లేని కంగారు వచ్చేసి నోట మాట రాలేదట ఆమెకు. ఆమె ఇబ్బందిని గమనించిన ప్రభాస్, ఓం రౌత్ ఇద్దరూ ఆమెకు సపోర్ట్ చేసి వర్క్ ఈజీ అయ్యేలా చేశారట. ముఖ్యంగా ప్రభాస్ ఇచ్చిన మోరల్ సపోర్ట్, సెట్లో ఆయన కలిసిపోయే విధానం గొప్పగా ఉంటాయని చెప్పుకొచ్చింది ఆమె.


