అల్లు అర్జున్ – ముంబై.. అసలు కథ ఇదే..!

అల్లు అర్జున్ – ముంబై.. అసలు కథ ఇదే..!

Published on Apr 21, 2026 12:00 AM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ పనుల కోసం ముంబైని తాత్కాలిక నివాసంగా మార్చుకున్నాడు. అయితే, బన్నీ త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అక్కడ సొంత ఇల్లు కొన్నారన్న వార్తల్లో నిజం లేదని, కేవలం షూటింగ్, VFX మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల సౌలభ్యం కోసం అద్దె ప్రాతిపదికన అకామడేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

దర్శకుడు అట్లీ కూడా అక్కడే ఉండి అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నాడట. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ కోసం ముంబై వేదికగా పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని బన్నీ భావిస్తున్నాడు.

‘పుష్ప 2’ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ‘వారణాసి’ వంటి భారీ చిత్రాలకు ధీటుగా అత్యుత్తమ క్వాలిటీతో ‘రాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ కష్టపడుతోంది.

తాజా వార్తలు