సినీపెద్దల అభ్యర్ధనలపై సానుకూలంగా ప్రభుత్వం.

Published on May 21, 2020 4:27 pm IST

ప్రముఖ సినీనటులు శ్రీ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం ఉదయం సమావేశమయ్యారు.

సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ…సినీ పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై సమావేశంలో చర్చించినట్టు మంత్రి తెలిపారు.ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉందని, అయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.

షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారు.ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తలసాని తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More