సెప్టెంబర్ 10 కి మొదలెడుతున్న “టక్ జగదీష్”

Published on Aug 27, 2021 1:27 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరో గా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు లు ముఖ్య నటులు గా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదల కి సిద్దం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఈ పండుగ కి ఫ్యామిలీ తో అమెజాన్ ప్రైమ్ వీడియో లో మీ టక్ జగదీష్ అంటూ హీరో నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం పోస్ట్ చేశారు. భూ దేవిపురం చిన్న కొడుకు నాయుడు గారి టక్ జగదీష్ చెప్తున్నాడు మొదలెట్టండి అంటూ వీడియో ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :