టక్ జగదీష్ డిజిటల్ ప్రీమియర్ పై త్వరలో అధికారిక ప్రకటన!

Published on Aug 19, 2021 6:00 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు సెప్టెంబర్ 10 వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం లో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :