బన్ని సమంతల మధ్య ఆసక్తికరమైన ట్వీట్స్ !

బన్ని సమంతల మధ్య ఆసక్తికరమైన ట్వీట్స్ !

Published on Aug 15, 2018 3:50 PM IST


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే.. ముందు వరసలో నిలిచే పేరు అల్లు అర్జున్. మరి ఆయనలా డాన్స్ చేయాలంటే కష్టమే కదా. కష్టమే అంటుంది ప్రముఖ కథానాయక సమంత కూడా. నా పేరు సూర్య చిత్రంలోని ‘లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో’ పాటకు బన్ని క్యాప్‌తో డ్యాన్స్‌ చేశాడు. కాగా అక్కినేని సమంత కూడా బన్నిలాగే డాన్స్ చేయాలని మూడు నెలలు పాటు ప్రాక్టీస్ చేసిందట. అయినప్పటికీ బన్నిలా చేయలేకపోయానని ట్వీటర్ లో పోస్ట్ చేసింది.

‘ఈ సాంగ్ లో (లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో) బన్నిలా డాన్స్ చేయాలని క్యాప్‌తో త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేశాను. కానీ చేయలేకపోయాను. అల్లు అర్జున్‌ కష్టపడటంలో నెంబర్‌ వన్‌’ అని నమస్కారం సింబల్ తో పోస్ట్‌ చేశారు. సమంత ట్వీట్‌ కు స్పందించిన అల్లు అర్జున్ ‘థాంక్స్ సామ్‌. ఇప్పుడే నీ ట్వీట్‌ చూశా. మీకు ట్రిక్స్‌ నేర్పించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది నాకు చాలా ఈజీ’ అని రీట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు