ట్విస్ట్.. “కన్నప్ప” లో ప్రభాస్ రోల్ అది కాదా..


డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా వైడ్ గా కూడా అనేకమంది అగ్ర తారల కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కన్నప్ప” ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా జాయిన్ అవ్వడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి తన పేరు వచ్చిన మొదట్లోనే తాను ఈ చిత్రంలో ఆ పరమ మహాశివుని పాత్రలో కనిపించనున్నాడు అని రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వార్తపై ట్విస్ట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్ర ఇది కాదట. ప్రభాస్ మరో పాత్ర చేస్తున్నాడని మహాశివునిగా అయితే అక్షయ్ కుమార్ కనిపించనున్నాడని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఒకవేళ నిజం అయితే ఫ్యాన్స్ దీనిని ఎలా తీసుకుంటారో చూడాలి.

Exit mobile version