మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న సాలిడ్ యాక్షన్ సినిమానే కాకా. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో చేస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమాని మేకర్స్ ఆల్రెడీ సాలిడ్ గ్లింప్స్ తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనౌన్స్ చేసేసిన సంగతి అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు కాకా అప్పటికి పూర్తయినా కూడా విడుదల వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం కాకా స్థానంలో మెగాస్టార్ లాంగ్ అవైటెడ్ ఫాంటసీ సినిమా విశ్వంభర ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది అంటూ కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
నిజానికి మేకర్స్ విశ్వంభర ని ఈ అక్టోబర్ దసరా రేస్ లో నిలపాలని చూసారు కానీ అది వీలు పడలేదు. సో సంక్రాంతికి లాక్ చేసారన్నట్టు ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


