మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి గత ఏడాది వచ్చిన చిత్రమే “వార్ 2”. ఇదే ఎన్టీఆర్ కి బాలీవుడ్ డెబ్యూ కూడా కాగా ఈ చిత్రం ఊహించని ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మాత్రం తారక్ పై పడినట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. అందుకే మరింత కేర్ తీసుకున్నారని కూడా తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ సినిమా డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ఈపాటికే ఎప్పుడో రావాల్సి ఉంది కానీ మధ్యలో కొంత బ్రేక్ పడింది. అయితే దీనికి అసలు కారణం. వార్ 2 ని మైత్రి శశి చెప్పడం వైరల్ గా మారింది. వార్ 2 అనుకున్న రేంజ్ లో రాణించకపోవడంతో ప్రశాంత్ నీల్ తో సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ ని మరింత అప్డేట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఇప్పుడైతే షూట్ మొత్తం శరవేగంగా కంప్లీట్ అవుతుందట. ఇన్ని రోజులు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు ఇంత జాప్యం నెలకొంది అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది.
