2017 లో సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకులు !

చిత్రం, జయం, నువ్వునేను వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ గత కొంత కాలంగా సక్సెస్ లో లేడు. తాజాగా ఆయన రానతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం సాధించి ఆయనను సక్సెస్ ట్రాక్ లో పడేసేలా చేసింది. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు ఈ సినిమా తరువాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ చెయ్యబోతున్నాడు.

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శేకర్ కమ్ముల ఈ మద్య తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. తాజాగా ఈ డైరెక్టర్ తీసిన ఫిదా సినిమా హిట్ అవ్వడంతో ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి చాలా మంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. తేజ , శేఖర్ కమ్ముల 2017 లో కమ్ బ్యాక్ అయ్యి సక్సెస్ ట్రాక్ ఎక్కారు.