దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏది చేసినా సంచలనమే! స్టార్ హీరోలతో బ్లాక్‍బస్టర్ సినిమా చేసిన వెంటనే మళ్ళీ ఓ మిడిల్ లెవెల్ బడ్జెట్‌లో డిఫరెంట్ సినిమా తీసి సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఈ మధ్యే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి చేసిన ‘లోఫర్’ సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తోన్న పూరీ, ఆ వెంటనే మరో కొత్త హీరోతో చేయనున్న సినిమా కోసం సిద్ధమవ్వడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. పూరీ తన తదుపరి సినిమాతో ఇషాన్ అనే కొత్త హీరోను పరిచయం చేయనున్న విషయం తెలిసిందే.
తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే ఈ సినిమాను ఈ నెలాఖర్లో సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా పూరీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారట. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఒకరు ఇప్పటికే పాపులర్ అయిన అమైరా దస్తూర్ నటించనుండగా, మరో హీరోయిన్‌గా ఏంజిలా క్రిస్లింకి నటించనున్నారు. ఇక ఒకపక్క స్టార్ హీరోలు పూరీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా పూరీ తనదైన పంథాలో ఇలా కొత్త హీరోలతోనూ సినిమాలు చేస్తూ పోవడం విశేషంగానే చెప్పుకోవచ్చు.
