మెగా హీరో సినిమాలో నటించనున్న ఇద్దరు హీరోయిన్స్ !
Published on Feb 28, 2018 8:17 am IST

తొలిప్రేమ సినిమాతో మంచి విజయం అందుకున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఘాజి సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో సినిమా చెయ్యబోతున్నాడు వరుణ్ తేజ్. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో వీరి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం. పాటలు ఈ సినిమాలో ఉండవని తెలుస్తోంది.

స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా అంతరిక్షం లో జరిగే కథగా రుపొందనుందని సమాచారం. జ్ఞాన శేఖర్ సినిమాతోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమా భారి బడ్జెట్ తో తెరకేక్కబోతోంది. జార్జ్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. లవ్ స్టొరీగా తెరకేక్కబోతున్న ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం త్వరలో తెలియనుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉంది.

 
Like us on Facebook