బన్నీ ఖాతాలో ఒకే రోజు రెండు మైల్ స్టోన్స్.!

బన్నీ ఖాతాలో ఒకే రోజు రెండు మైల్ స్టోన్స్.!

Published on Jan 8, 2021 8:00 AM IST

allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. గత ఏడాది సరిగ్గా ఇదే సంక్రాంతి రేస్ లో విడుదల కాబడిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా ఎంత పెద్ద హిట్టయ్యిందో థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ కూడా అంతే స్థాయి హిట్టయ్యింది. మరి వాటిలో బుట్ట బొమ్మ సాంగ్ సెన్సేషన్ అయితే వేరే చెప్పనక్కరలేదు.

లేటెస్ట్ గా అయితే ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసి సంచలన రికార్డు సెట్ చేసింది. ఇక ఇదే అనుకుంటే సోషల్ మీడియాకు కింగ్ అని పిలుచుకునే బన్నీ ఇదే రోజున తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను 10 మిలియన్ మార్క్ ను దాటించాడు. దీనితో ఈ రెండు మైల్ స్టోన్స్ కూడా ఒకే రోజు బన్నీ తన ఖాతాలో వేసుకొని తన హవా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం బన్నీ తన మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు