వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ‘మహర్షి’ పేరు పెట్టి మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఫస్ట్ లుక్ టీజర్ కి మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. రిలీజ్ అయిన గంటల్లోనే ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఈ చిత్రంలో రెండు వేరు వేరు లుక్స్ లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవ్వడానికి సన్నాహాలు జరుపుకుంటుంది.


