రాజ‌శేఖ‌ర్ క‌ల్కి చిత్రంలో.. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు..!

Published on Oct 30, 2018 9:11 am IST

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం క‌ల్కి. గ‌త ఏడాది వ‌చ్చిన పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్ళీ ఫామ్‌లోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ కొంత గ్యాప్ తీసుకుని.. అ! వంటి విల‌క్షణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో క‌ల్కి చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. 1980 నాటి క‌థ‌, పీరియాడిక్ నేప‌ధ్యం డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బెంగుళూరు బ్యూటీ నందిత స్వేత కీల‌క పాత్ర‌లో నటిస్తుంద‌ని కొద్ది రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా క‌ల్కి చిత్రంలో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌ను ఓకే చేశార‌ని స‌మాచారం. అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్. ఈ ఇద్ద‌రు భామ‌లు క‌ల్కి చిత్రంలో భాగ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పీరియడ్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మ‌రి రాజశేఖర్‌కు క‌ల్కి చిత్రం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :