చైతన్య కోసం ఇద్దరు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్స్

naga-chaitanya1
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చేస్తున్న మరో సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్ లో నటించనున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమాని నవంబర్ 30వ తేదీన లాంచ్ చేసి, డిసెంబర్ మొదటి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర టీం ఒరిజినల్ వెర్షన్ కి మ్యూజిక్ అందించిన రాజేష్ మురుగేషన్ ని తెలుగు వెర్షన్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుపుతున్నారని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఒకరిని కాదు ఇద్దరిని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ గా సెలక్ట్ చేసారు. ఆ ఇద్దరూ కూడా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. వారే రాజేష్ మురుగేషన్ మరియు గోపిసుందర్. ముగ్గురు హీరోయిన్స్ కి అవకాశం ఉన్న ఈ సినిమాలో ఇప్పటికే శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేసారు. ప్రస్తుతం మరో భామ కోసం అన్వేషణ జరుగుతోంది.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version