అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు !

Published on Apr 14, 2019 3:00 am IST

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఈ రోజు పూజ కార్యక్రమంతో మొదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. నాగ్ మేనల్లుడు సుశాంత్, నవదీప్ లు ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారట. ముఖ్యంగా సుశాంత్ క్యారెక్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని.. ప్రధానంగా స్వాతిముత్యం టైపు క్యారెక్టర్ అని సమాచారం.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. టబుకి జోడిగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అంట. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :