భారీ ధర పలికిన యు టర్న్ హక్కులు !

భారీ ధర పలికిన యు టర్న్ హక్కులు !

Published on Aug 22, 2018 3:09 PM IST

U turn

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత తెలుగు , తమిళ భాషల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. పవన్ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రం కన్నడ లో ఘన విజయం సాధించిన యు టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తుంది. ఇక ఈచిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శివమ్ సెల్యులాయిడ్ ఈ హక్కులను దక్కించుకుంది.

భూమిక , అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలకానుంది.

తాజా వార్తలు