వరుణ్ తేజ్ తర్వాతి సినిమా కూడ విదేశాల్లోనే !


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి ప్రాజెక్టుకు సిద్దమవుతూనే నిన్న మరోకొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్టక్ చేయనున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడట.

అంతేగాక ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమా ఎక్కువ భాగం యుకే బ్యాక్ డ్రాప్లో జరుగుతుందని, ఎక్కువ భాగం చిత్రీకరణ అక్కడే చేస్తారని, ఇందులో వరుణ్ తేజ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని టాక్. వరుణ్ తేజ్ గత రెండు సూపట్ హిట్ సినిమాలు ‘ఫిదా, తొలిప్రేమ’లు విదేశీ నైపథ్యంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే.