‘బాహుబలి’కి అండగా సినీ పరిశ్రమ!

‘బాహుబలి’కి అండగా సినీ పరిశ్రమ!

Published on Jul 9, 2015 8:47 PM IST

Baahubali
‘బాహుబలి’ లాంటి సినిమా ఏ సినీ పరిశ్రమలోనైనా ఎప్పటికోగానీ రాదు. ఓ సినిమాపై ఈ స్థాయి అంచనాలు, క్రేజ్ బహుశా కొన్ని దశాబ్దాల కాలంగా వేరే ఏ ఇతర సినిమాకూ లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి రేపు (జూలై 10న) తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అర్ధరాత్రి నుంచే చాలాచోట్ల బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి.

తెలుగు సినిమా ఖ్యాతిని గర్వంగా చాటిచెప్పే సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాకు సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభిస్తోంది. సూపర్ స్టార్లు మొదలుకొని, పెద్ద పెద్ద నిర్మాతలు, స్టార్ దర్శకులు.. ఇలా అందరూ బాహుబలి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వరుసగా ఈ వీకెండ్ మొత్తంలో అన్ని షోలూ ఇప్పటికే బుక్ అయిపోయాయంటే ఈ సినిమాకున్న క్రేజ్ ఏంటో చెప్పేయొచ్చు. ఇక రేపు సినిమా విడుదలయ్యాక ఓ సాధారణ సినీ అభిమాని ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలన్నీ చేరుకొని బాహుబలి తెలుగు సినిమా గర్వంగా నిలబడాలని కోరుకుందాం.

తాజా వార్తలు