బిగ్ బాస్ 4 – ఈ వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ ఉందా?

బిగ్ బాస్ 4 – ఈ వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ ఉందా?

Published on Dec 12, 2020 8:00 PM IST

Bigg 1

ఇంకొక్క వారం రోజుల్లో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షోకు తెర పడిపోనుంది. మరి అలా జరగాలి అంటే ఈ వారాంతం కూడా ఖచ్చితంగా ఎవరొకరు ఎవిక్ట్ అవ్వాల్సిందే. మరి ఈ వీకెండ్ లో అది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు వస్తుండగా మరోసారి బిగ్ బాస్ ఆడియెన్స్ కు షాక్ తప్పదా అని బజ్ వినిపిస్తుంది.

ఆల్రెడీ ఫైనల్స్ టికెట్ తో అఖిల్ ఫైనల్స్ లో ఉన్నాడు. దీనితో మిగతా అంతా నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఇప్పటికే అభిజీత్ సేఫ్ జోన్ లో ఉన్నాడని టాక్ వినిపించింది. కానీ డేంజర్ జోన్ విషయానికి వస్తే ఎప్పటి లానే మోనాల్ ఉందని అన్న సంగతి కూడా బయటకొచ్చింది.

అలాగే హారిక పేరు కూడా అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి వచ్చిందని కూడా బజ్ వచ్చింది. అయితే మరి ఈ ఇద్దరి నడుమ ఒకరు ఊహించని విధంగా ఎలిమినేట్ అవుతారు అని తాజా బజ్. మరి అలాగే మళ్ళీ మోనాల్ సేవ్ అయ్యింది అని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు