‘రామ్ లీల’ కోసం హై రేంజ్ ప్రమోషన్స్

‘రామ్ లీల’ కోసం హై రేంజ్ ప్రమోషన్స్

Published on Feb 18, 2015 10:43 PM IST

ram-leela
‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘జీనియస్’తో తన లోని టాలెంట్ ని చూపిన యంగ్ హీరో హవీష్ చేసిన మరి లేటెస్ట్ మూవీ ‘రామ్ లీల’. హవీష్ తో పాటు అభిజిత్, నందిత నటీనటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించాడు. చిన్నా మరియు శివమణి కలిసి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. షూటింగ్ తో పాటు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

త్వరలో సెన్సార్ కి పంపడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఓ మంచి సినిమాని ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా చెయ్యాలని పలు కొత్త రకాల ఆలోచనలతో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ కార్యక్రమంలో లాంచ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా పై హవీష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

తాజా వార్తలు