యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ కింగ్ ఆఫ్ కొత్త. వెఫరర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన కింగ్ ఆఫ్ కొత్త నుండి ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.
ఇక రేపు పలు భాషల ఆడియన్స్ ముందుకి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ. అయితే రిలీజ్ విషయంలో కింగ్ ఆఫ్ కొత్త ఒక యూనిక్ రికార్డు నెలకొల్పింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 50 దేశాల్లోని 2500 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. కాగా ఇది ఒక మలయాళ మూవీకి అత్యధిక స్క్రీన్స్ రిలీజ్ అని తెలుస్తోంది. మరి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


