అన్‌స్టాపబుల్2: ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్!

అన్‌స్టాపబుల్2: ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్!

Published on Dec 18, 2022 11:44 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విచ్చేస్తున్నాడు. ప్రభాస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మరియు అతని సింప్లిసిటీ, బిహేవియర్ కారణం గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ బయట చాలా అరుదుగా కనిపిస్తుండడంతో ఈ ఎపిసోడ్ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నిన్న ఆహా వీడియో ప్రోమో విడుదల చేయడం జరిగింది.

ఈ మూడు నిమిషాల ప్రోమో ఒక రోజులో అద్భుతమైన కోటి డిజిటల్ వ్యూస్ ను సంపాదించింది. అలాగే, దీనికి 900కే కి పైగా లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇది నటుడి అభిమానులలో ఉన్న క్రేజ్ ను తెలియజేస్తుంది. ప్రోమోకే ఇంత రెస్పాన్స్ వచ్చినట్లయితే, పూర్తి నిడివి గల ఎపిసోడ్ కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు