సెన్సేషనల్ రికార్డ్ సెట్ చేసిన “లవ్ స్టోరీ” సాంగ్..!

Published on Apr 1, 2021 2:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించితిన్ లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” పై మంచి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవి నుంచి రెండో సినిమా కావడం పైగా ఇందులో కూడా ఒక సెన్సేషనల్ చార్ట్ బస్టర్ ను ఆమెపై ప్లాన్ చెయ్యడం మరో లెవెల్ కి వెళ్లాయి.

తెలంగాణా జానపద గేయం సారంగా దరియా అంటూ మంగ్లీ మ్యాజికల్ వాయిస్ కి తోడు సాయి పల్లవి చార్మ్ యాడ్ అవ్వడంతో ఈ సాంగ్ విడుదలైన మొదటి రోజు నుంచే భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పుడు అలా మళ్ళీ సెన్సేషనల్ ఫీట్ ను సెట్ చేసింది. మన తెలుగులోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్ గా ఇది ఇప్పుడు నిలిచింది.

మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు అయితే అసలు ఆగేలా లేదని చెప్పాలి. పవన్ సి హెచ్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఈ సినిమాకు ఇప్పటికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :