విక్రమ్ -నాని కాంబో ఓకే అయినట్లేనా ?

విక్రమ్ -నాని కాంబో ఓకే అయినట్లేనా ?

Published on Nov 29, 2018 9:00 AM IST


‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ రీసెంట్ గా నాని ని కలిసి కథ వినిపించడం దానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్ దర్శకత్వంలో నాని నటించడం దాదాపు ఖాయమైట్లేనట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. తర్వలోనే ఈ చిత్రం ఫై అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ఇక నాని ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ఈ చిత్రాన్ని పూర్తి చేసి విక్రమ్ కుమార్ సినిమాని మొదలుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు