శైలజారెడ్డి అల్లుడు అప్ డేట్స్ !

Published on Aug 17, 2018 1:00 pm IST

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ప్రస్తుతం ఈచిత్రం రి రికార్డింగ్ పనులను జరుపుకుంటుంది. మలయాళీ సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతం అందిస్తుండడం తో చిత్రం యొక్క రి రికార్డింగ్ కోచ్చి లో జరుగుతుంది. ఇక కేరళలలో వర్షాల కారణంగా ఈ పనులను కొత్త ఆటకం కలుగుతుందట అయినా కూడా క్వాలిటీ లో ఏమా త్రం రాజీ పడకుండా రి రికార్డింగ్ పనులు చేపడుతున్నరట ఈవిషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు మారుతీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అయన కూడా అక్కడే ఉన్నారు.

ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను వాయిదా వేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈనెల 31న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More