చరణ్ తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన ఉపాసన !

Published on Jun 2, 2019 3:18 pm IST

రామ్ చరణ్, ఉపాసన.. ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ చూడ ముచ్చటైన జంట అని పేరు తెచ్చుకున్నారు. తినే ఫుడ్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ రామ్ చరణ్‌కు తోడుగా ఉంటుంది ఉపాసన. త్వరలో వీరి వివాహ వార్షికోత్సవం రానుండటంతో ఆఫ్రికా టూర్ ప్లాన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు వీరిద్దరూ. యాత్రకు సంబందించిన విశేషాల్ని ఎపప్టికప్పుడు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తున్న ఉపాసన తాజాగా తనలో ఏ క్వాలిటీ నచ్చి చరణ్ తనను పెళ్లి చేసుకున్నాడో చెప్పుకొచ్చారు.

లయన్ సఫారీలో భాగంగా ఉపాసన సింహం పిల్లలతో ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆడుకుని తనలో ఎంత ధైర్యం ఉందో ప్రదర్శించారు. అంతేకాదు ఇప్పుడు అర్థమైందా మిస్టర్ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అంటూ తన ధైర్యం అంటే చరణ్‌కు ఎంతిష్టమో చెప్పుకొచ్చారు. ప్రకృతిని గౌరవించాలని, ప్రకృతిని, జంతువుల్ని కాపాడుకోవడానికి అంధర్మ కలిసి కృషి చేయాలని అన్నారు. ఇకపోతే ఈ టూర్ పూర్తవగానే చరణ్ రాజమౌళి సినిమా షూటింగ్లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం :

More