స్టార్ హీరో చరణ్ భార్యగా అందరికీ తెలిసిన ఉపాసన, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ కోడలిగా కుటుంబం బాధ్యతలు నెరవేర్చే ఉపాసన, యంగ్ ఎంట్రప్రెన్యూర్ కూడా. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ నడుపుతున్న ఉపాసన అనేక మంది బాలీవుడ్ స్టార్స్ ని తన మ్యాగజైన్ తరపున ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక రామ్ చరణ్ ఫిట్నెస్, డైట్ విషయంలో కూడా ఉపాసన అనేక సలహాలు ఇస్తూ ఉంటారు.
మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఉపాసన మానవతావాది మరియు జంతు ప్రేమికురాలు. నిన్న బర్త్ డే జరుపుకున్న ఉపాసన ఓ ఏనుగు పిల్లను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లిన ఉపాసన అక్కడ రాణి అనే ఓ ఏనుగు పిల్లను దత్తత తీసుకున్నారు. దాని సంరక్షణార్థం 5లక్షల రూపాయల చెక్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఉపాసన చేసిన ఈ పనికి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.


