హిమాలయాలలో సహస యాత్ర చేస్తున్న ఉపాసన

హిమాలయాలలో సహస యాత్ర చేస్తున్న ఉపాసన

Published on Jan 11, 2020 3:39 PM IST

upasana

ఉపాసన కొణిదెల హిమాలయాలలో సహస యాత్ర చేస్తున్నారు. ఆమె గడ్డ కట్టించే చలిలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు కి చేరుకోవడంతో పాటు, ముక్తినాద్ టెంపుల్ మరియు పశుపతి నాధ్ టెంపుల్ సందర్శన తరువాత రెండు రోజులలో తిరిగి ఇంటికి చేరుకోనున్నారట. ఈ విషయాన్ని ఉపాసన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని ఉన్నతంగా మొదలుపెట్టాలనుకుంటున్న ఆమె ఈ సాహస యాత్రకు వెళ్లారట. మండే ఎండా కాలం లోనే ఎముకలు కొరికే చలి వుండే హిమాలయాలను వింటర్ లో సందర్శించడం నిజంగా సాహసోపేతం అనాలి.

గత ఏడాది భర్త రామ్ చరణ్ తో కలిసి ఉపాసన ఆఫ్రికా వైల్డ్ లైఫ్ సఫారీ కి వెళ్లారు. అక్కడ వారు తీసిన వివిధ జంతువులు మరియు అందమమైన ప్రదేశాలతో కూడిన వైల్డ్ లైఫ్ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలోని సన్నిహితులకు ప్రదర్శన ఇచ్చారు. అలాగే బి పాజిటివ్ అనే ఒక హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఆమె నడుపున్నారు. ఏదిఏమైనా మెగా కోడలు ఉపాసన ప్రతి విషయంలో తన ప్రత్యేకత చాటుకుంటూ భర్తకు తగ్గ భార్య అనిపిస్తున్నారు.

తాజా వార్తలు