RRR బెనిఫిట్ షోను ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన

RRR బెనిఫిట్ షోను ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన

Published on Mar 25, 2022 2:40 PM IST


టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ బిగ్గీ RRR, ఎట్టకేలకు ఈరోజు థియేటర్ల లో విడుదలైంది. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి మావరిక్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి అన్ని చోట్లా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. స్టార్ నటుడు రామ్ చరణ్ తన తాజా సినిమా బెనిఫిట్ షోను హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానులతో కలిసి వీక్షించారు. అంతేకాకుండా, అతని ప్రియమైన భార్య ఉపాసన కొణిదెల కూడా అతనితో పాటు వచ్చారు.

సినిమా సమయంలో ఆమె చరణ్‌ కి ఫ్యాన్ గర్ల్ గా మారి ఆనందంతో కాగితాలను గాలిలోకి విసిరేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. RRR లో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు