మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ రూరల స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో పెద్ది చిత్రానికి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ చరణ్‌కు ఆయన భార్య ఉపాసన తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మెగా ఇంట్లోని స్టాఫ్ అందరూ కలిసి ‘చికిరి చికిరి’ సాంగ్‌కు స్టెప్పులేస్తూ వీడియో చేశారు. ఈ వీడియో క్లిన్ కారా వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవ్వడంతో ఈ సర్‌ప్రైజ్ అదిరిపోయింది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి మురిసిపోతున్నారు.
ఇక పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు.


