ఉపాసన తాతగారు మృతి..!

ఉపాసన తాతగారు మృతి..!

Published on May 27, 2020 11:42 AM IST

హీరో చరణ్ భార్య ఉపాసన తాత గారైన ఉమాపతి రావు కామినేని తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఉమాపతి రావ్ నేడు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన మనవరాలు ఉపాసన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉమాపతి రావ్ కుమారుడు అనిల్ కాగా ఆయన కుమార్తె ఉపాసన.

మాజీ ఐ ఏ ఎస్ అధికారి అయిన ఉమాపతి రావుది ఘన చరిత్ర కలిగిన కుటుంబం. దోమకొండ సంస్థానానికి చెందిన ఆయన ఆ కోటాలో పుట్టిన చివరివాడు. ఇక తాత మృతిపై ఉపాసన ఓ సుదీర్ఘ భావోద్వేగ సందేశం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు