‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Feb 21, 2022 3:50 PM IST

కరోనా మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

 

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటంచిన చిత్రం “సెహరి’ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది.

 

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సినిమా :

 

ద ప్రాటేష్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

ద ఫేమ్‌ గేమ్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

వైకింగ్స్‌: వాల్దా (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

థి జువైనల్‌ జస్టిస్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఏ మాడియా హోమ్‌ కమింగ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

ఈ వారం డిస్నీ – హాట్‌ స్టార్ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

స్టార్‌ వార్స్‌ ఒబీ -వాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

 

లవ్‌ హాస్టల్‌ (హిందీ) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

ఈ వారం సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

 

అజగజాంతరం (మలయాళం) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఏ డిస్కవరీ ఆఫ్‌ విచెస్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు