దబాంగ్ 3 షూటింగ్ అప్డేట్ !

Published on Apr 19, 2019 9:04 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబాంగ్ 3 ఇటీవలే మహేశ్వర్ లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం రెండవ షెడ్యూల్ వచ్చే నెలలో ముంబై లో స్టార్ట్ కానుంది. ఈషెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ గుర్గాన్ వెళ్లనుంది. ఈసినిమా యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ అంత అక్కడే జరుగనుంది.

ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ విలన్ పాత్రలో నటింస్తుండగా సల్మాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుంది. సూపర్ హిట్ దబాంగ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కతున్న ఈచిత్రం ఈఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :