అల్లరి నరేష్, సునీల్ సినిమా అప్డేట్ !
Published on Mar 9, 2018 5:08 pm IST

అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 12 నుండి హైదరాబాద్ లో మొదలుకాబోతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించబోతున్నారు. ఇందులోని మరొక నటుడు సునీల్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. అల్లరి నరేష్, సునీల్ ఈ మూవీలో స్నేహితులుగా కనపడబోతున్న సంగతి తెలిసిందే.

చిత్ర శుక్ల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీ వసంత్ సంగీతం సమకూరుస్తున్నాడు. బీమినేని, అల్లరి నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సుడిగాడు సినిమా పెద్ద విజయం సాధించింది. అదే తరహ కామెడి ఈ మూవీలో ఉండబోతోందని సమాచారం. త్వరలో ఈ మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. అల్లరి నరేష్ తాజాగా నందిని నర్శింగ్ హోం డైరెక్టర్ గిరి తో ఒక సినిమా మొదలు పెట్టాడు ఈ సినిమా షూటింగ్ మే నుండి మొదలు కాబోతోంది.

 
Like us on Facebook