అరవింద సమేత షూటింగ్ అప్ డేట్స్ !

Published on Jul 14, 2018 8:42 pm IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్సకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. గత కొద్దీ రోజులుగా విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఈనెల 16 నుండి రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది. ఇక ఈ షెడ్యూల్ అనంతరం తదుపరి షెడ్యూల్ కోసం పొల్లాచ్చి వెళ్లనుంది చిత్ర యూనిట్.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగబాబు , జగపతి బాబులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :