ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఫై ఆరోజే క్లారిటీ రానుంది !

Published on Apr 10, 2019 7:43 pm IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వెన్నుపోటు అనే సంఘటలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అయితే ఈ చిత్రం ఏపీలో తప్ప అంతటా మార్చి 29 న విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇక ఏపీలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఏపీ హైకోర్టు వచ్చే సోమవారం ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఈ రోజు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి మరియు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఈ సినిమాను చూసి తీర్పు ను సోమవారం కి వాయిదా వేశారు. దాంతో ఈ సినిమా ఈనెల 12న అక్కడ విడుదలకావడం లేదు.

సంబంధిత సమాచారం :