‘రంగస్థలం’ నుండి అన్ని పాటలు విడుదలవుతున్నాయి !
Published on Mar 14, 2018 1:50 pm IST

చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా నుండి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా మిగిలిన పాటల్ని కూడ కలిపి అన్ని పాటల్ని రేపు ఉదయం 10 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. సినిమాలో మొత్తం 5 పాటలు ఉండబోతున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు, ఆది పినిసెట్టి వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్నారు. ఇకపోతే ఈ నెల 18 న ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్లో గ్రాండ్ గా జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

 
Like us on Facebook