రవితేజ సినిమా కోసం భారీ సెట్ !

17th, March 2018 - 11:51:00 AM

‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ ప్రస్తుతం ‘నేల టికెట్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. మంచి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారట. ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. అలాగే మే నెల ఆరంభానికి షూటింగ్ మొత్తం పూర్తై అదే నెలాఖరున చిత్రం విడుదలవుతుందట.

రేపు ఉగాది సందర్బంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. మాళవిక శర్మ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తుండగా ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రాన్ని కూడ ఇటీవలే మొదలుపెట్టారు.